Wednesday, July 12, 2023

వాస్తవం 

 నిన్నటి వరకు 

పచ్చ చొక్కాలు తొడుక్కున్న 

పంట పొలాలన్ని

నేడు గళ్ళ చొక్కాలు తొడుక్కున్నాయి 

అప్రువుడ్ లే అవుట్స్ కదా మరి !

సారవంతమైన మట్టి

ఏమీ చేయలేక 

నిస్సారంగా నిశ్శబ్దంగా

కస్టమర్స్ ని ఆకర్షించడానికి 

వేసిన పలుచటి తారు రోడ్డు క్రింద

సమాధి అవుతోంది

కొన్ని వేల  కాలే కడుపులకి

అన్నం పెట్టిన 

వేల చదరపు గజాల మట్టి

రిజిస్టర్ ఆఫీసు దస్తావేజుల్లో

చివరి శ్వాస తీసుకుంటుంది

ఒకప్పటి పంట కాలువ

ఎండిపోయి బిక్కు బిక్కు మంటోంది

రైతు చెమట పడ్డ చోటల్లా

గడ్డి పూల చెట్లు 

గతానికి సాక్షుల్లా నిలబడ్డాయి

పైరు మీంచి వీద్దామని 

వచ్చిన గాలి

స్థాణువై నిట్టూరుస్తోంది

ఎక్కువ ధర వస్తే

ప్లాటు అమ్మి పిల్ల పెళ్లి 

చేద్దామాన్న సామాన్యుడి ఆశ

ప్లాటు నలుప్రక్కలా

హద్దు రాళ్ళలా

సగం పాతుకుపోయింది

అమ్మిన రైతు 

అప్పులు తీర్చి

పొట్ట చేత పట్టుకుని

పట్నం పోయి 

రిక్షా లాగుతూ 

చెమటని తారు రోడ్ల మీద

ఆవిరి చేస్తున్నాడు

దళారుల జేబులు 

ప్రక్క నున్న 

కొండల్లా 

ఎత్తుగా

ఠీవిగా మీసం తిప్పుతున్నాయి

ప్రగతి పేరుతో

జరిగే అరాచకాలు దిక్కులు పిక్కటిల్లేలా అట్టహాసం చేస్తున్నాయి

పంట భూముల 

ఛాయాచిత్రాలు

పుస్తకాల్లో చూస్తూ

రేపటి పౌరులు

కేరింతలు కొడుతున్నారు

Sunday, December 6, 2020

వికాసం సమావేశం

 06.12.20  ఆదివారం వికాసం తొలి జూమ్ సమావేశం వివరాలు 


సరిగ్గా ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమయింది. 

శ్రీ రవి శర్మ  మనసా అన్న ప్రారంభ గీతం. 

ఆ తరువాత అధ్యక్షుల వారు తమ ప్రసంగంలో వికాసం  50 వ పుట్టినరోజు జరుపుకోవాలని, 

కార్యదర్శి శ్రీ వీజయ  చంద్ర గారు తనకి రాజీనామా  లేఖ పంపిచ్చిన దృష్ట్యా కొత్త కార్యదర్శి ని ఎన్నుకోవాల్సిన  అవసరం ఏర్పడిందని అన్నారు. 

వికాసం వ్యవస్థాపక సభ్యుల్లో   ఒకరయిన శ్రీ  కే ఎల్ ప్రసాద్ గారు, ఎన్నికలు నిర్వహించడానికి ముందుకి వస్తే, హాజరయిన సభ్యులు అందరూ దానికి అంగీకారం తెలిపారు. 

శ్రీ ప్రసాద్ గారు, శ్రీ కామేశ్వర రావు గారు , అధ్యక్షులుగా కోనసాగాలని సూచించారు. 

దానికి అందరూ  సభ్యులు తమ మద్దతు తెలిపారు. 

 తదూపరి  కోశాధికారి గా శ్రీ రామ నరసింగరావు గారి పేరు సూచించారు. 

ఇప్పటి  కోశాధికారి  శ్రీ కేదార్నాథ్ గారు  ఆ మాటను బలపరిచారు. 

శ్రీ రామనరసింగరావు గారు అంగీకరించారు.

తదుపరి, కార్యదర్శి గా శ్రీ రవి శర్మ గారి పేరు శ్రీ ప్రసాద్ గారు సూచించారు.

 సభ్యులు  అందరూ దానికి అంగీకరించారు.

50 వ వార్షికోత్సవ  సమావేశం భారీ ఎత్తుగా మూడు రోజుల పాటు చేయాలని శ్రీ  ప్రసాద్ గారు  అన్నారు. 

ఒక బ్లాగ్ తయారు చేసి ఈ సమావేశం వివరాలు పెట్టమని అన్నారు. 

వికాసం పేరుతో క ఫేస్బుక్ పేజీ చేయాలని ఆయన సూచించారు. 

ఒక బెంక్   అక్కౌంటు అధ్యక్షులు, కార్యదర్శి ఇంకా కోశాధికారి జాయింటు  అక్కౌంటుతో  రెండు మూడు రోజుల్లో తెరవడం జరుగుతుంది. 

విరాళాలు, వ్యతిగతమైన ఆర్ధిక సహాయాలు  ఆ ఖాతాలో జమ చేయవచ్చు.

ఇంకా నెల నెలా వికాసం సమావేశాలు జూమ్ లేక గూగుల్ మీట్ లో చేయడానికి కూడా అందరూ సభ్యులు  ప్రతిపాదన చేశారు.

సమయాభావం వలన సమావేశం ముగిసింది. 

హాజరయిన సభ్యులు:

1. శ్రీ కామేశ్వరరావు గారు 

2. శ్రీ కే. ఎల్. ప్రసాద్ గారు 

3. శ్రీ ఆదినారాయణ గారు 

4. శ్రీ రామ్ నరసింగ్ గారు 

5. శ్రీ  రమేష్ గారు 

6. శ్రీ కేదార్నాథ్ గారు 

7. శ్రీ కెనారా 

8. శ్రీ విఎస్ఎన్  మూర్తి గారు 

9. శ్రీ వెంకట్  గారు 

10 శ్రీ దినకర్ 

11. శ్రీ తిరుమల రావు గారు 

12. శ్రీ ధర్మచార్యులు గారు 

13. శ్రీ జగదీష్ గారు 

14. శ్రీ రవి శర్మ 

తొలి జూమ్ సమావేశం విజయవంతం చేసిన అందరికీ కి పేరు పేరునా ధన్యవాదాలు, నమస్సులు.

Friday, September 21, 2012